“సోదర సమానులైన ఆనంద్ గారి అమ్మకు అద్భుత సహాయం: రైతు సంరక్షణ ఫౌండేషన్ సేవలు”
సోదర సమానులైన ఆనంద్ గారి అమ్మ స్వరూప గారికి కొరకు ఒక వారం క్రితం ఫండ్ రైజ్ చేయడం జరిగింది. ఈరోజు నేను రామ్, సతీష్ కలిసి మేడ్చల్ లోని అద్విత హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. స్వరూప అమ్మగారికి ఆపరేషన్ విజయవంతం అయ్యింది. వారు ఇప్పుడే కొలుకొంటున్నారు. రేపు వారిని డిచార్జి కూడా చేయబోతున్నారు. ఒక కుటుంబాన్ని మీరందరు కాపాడినందుకు మీకు నేను కూడా కృతజ్ఞుడిని. దీనికి మీరంతా ఒక్కో రూపాయి జమ చేస్తే 23000 అయ్యాయి. మరో రెండువేల రూపాయలు ఇచ్చాడు. ఆనంద్ కి 25000 రూపాయలు నగదు అందచేయడం జరిగింది. ఒక వంద మనం ఒక పది నిమిషాలలో వృధా ఖర్చు చేయగలం. మీరంతా ఇచ్చిన వంద, రెండొందలు, ఆపైన మొత్తం ఒక కుటుంబంలో చిరునవ్వు చిందించాయి. విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పెరు పేరునా ధన్యవాదాలు. మీ అందరి ఫోన్ నంబర్స్ ఆనంద్ తీసుకొని మీకు కచ్చితంగా మీకు కాల్ చేసి మాట్లాడతానని చెప్పాడు. సదా మీ సేవలో మీ RSF https://www.facebook.com/రైతు-సంరక్షణ-ఫౌండేషన్-RSF-2290858121136982/ https://www.facebook.com/groups/299314844009850/
Leave a Reply