“సమాజ సేవలో ఒక్కటే: రైతు సంరక్షణ ఫౌండేషన్ మద్దతు తీసుకుంటున్నాది మీరే!”
అందరికి నమస్తే.
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలతో పాటు కొన్ని జిల్లాల్లో అపారమైన నష్టం జరగడం సామాజిక మాధ్యమాల్లో చూసాము.
చాలామంది నిరాశ్రయులయ్యారు, అన్ని కోల్పోయారు, వారికి మేమున్నాము అని ముందుకు బయలేదేరడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
విపత్తులు ఎప్పుడూ మనకు మానవులంతా ఒక్కటే, మీకు మీరే సాయం చేసుకోండి అని నేర్పిస్తుంటాయి అని మేము నమ్ముతుంటాము.
అందుకే మీరు చేయాల్సింది ఒక్కటే మీకు తెలిసిన, మీరు ఉంటున్న ప్రాంతంలో ఎవరికైనా నిత్యావసరాలు, తిండి, బట్ట లేక ఉంటే ఖచ్చితమైన వివరాలతో ఈ కింది నెంబర్ కి వాట్సాప్ చేయండి. దయచేసి వాట్సాప్ మాత్రమే చేయండి.
దగ్గరలో ఉన్న రైతు సంరక్షణ వాలంటీర్స్ మిమ్మల్ని చేరుకుంటారు.
వాట్సప్ నెంబర్: 9849005090
ఈ విషయం మీ వాట్సాప్ గ్రూప్స్లో పంపండి, మరియు మాతో పాటు మీ చెయ్యి కలిపి మనమంతా మనవతావాదులం అని సమాజానికి చాటి చెబుదాం.
మీ రైతు సంరక్షణ ఫౌండేషన్#RSF
Leave a Reply