“గిరిజన ప్రాంతంలో నిత్యావసర సరుకులు పంపిణీ: రైతు సంరక్షణ పౌండేషన్ మధ్య కర్మసాధన”
*గిరిజన ప్రాంత ప్రజలకి నిత్యావసరాల పంపిణీ:*
13వ తారీఖున తూర్పు గోదావరి జిల్లా గిరిజన ప్రాంతమైన కూనవరం మండలం లో గండి కొత్తగూడెం, నల్ల మామిడి గొంది గ్రామాలలో 70 కుటుంబాలకు సాయం చేయగా మేము చేసిన నిత్యావసర సరుకులు పంపిణీ చేసే సమయంలో ఇంకా 44 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారు అని తెలిసి ఈరోజు వారికి కూడా అండించాము…
*రైతు సంరక్షణ పౌండేషన్#RSF* ద్వారా 550/- రూపాయలు విలువ గల నిత్యావసర సరకుల బ్యాగ్ ప్రతి కుటుంబానికి ఒకటి ఇవ్వడం జరిగింది.
మన గత కార్యక్రమాలు చూసి ఎంతో మంది దాతలు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. మేము ఏ కార్యక్రమం చేస్తున్నా మేము సైతం మీతో అంటూ మా సోదరుడు బాల మురళి మరియు తన స్నేహితులు, అలాగే మాధురి గారు వారి స్నేహితులు మరియు అమెరికా లో ఉన్నటువంటి అశోక్ & అవినాష్ 100 డాలర్స్ పంపించి మరింత ప్రోత్సాహం అందించారు. మరియు ఆత్రేయ మరియు అతని మిత్రులు ప్రతి ప్రోగ్రాంకి చాలా హెల్ప్ చేస్తున్నందుకు కృతఙ్ఞతలు.
మరియు మాతోటి ఎప్పుడూ వుండే #fixmynation &టీం జిందగీ కి మనసారా కృతఙ్ఞతలు తెలుపుతున్నాము.
ఈ కార్యక్రమం లో సంస్థ ప్రతినిధి మర్రి.రవికుమార్, కె.అర్జున్(హెల్త్ అసిస్టెంట్ ),లక్ష్మి (ఆశ ), సత్య బాపూజీ వీరికే ఈ క్రెడిట్ మొత్తం చెందుతుంది. వారే మొత్తం ప్యాకింగ్ చెసుకొని 7km అడవిలో నడుచుకొంటూ వెళ్ళి వీరికి అందివ్వడం వీరి గొప్ప మనసుకు నిదర్శనం
*రైతు సంరక్షణ పౌండేషన్ సంస్థ* భవిష్యత్ లో ఇలాంటి ఎక్కువ గ్రామాలను ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటుంది.
*మీ టీం రైతు సంరక్షణ ఫౌండేషన్ #RSF*
Leave a Reply