“క్యాన్సర్ పేషెంట్ అక్బర్ వలీకి మందులు అందించే సహాయం: రైతు సంరక్షణ ఫౌండేషన్ చేసిన ప్రయాణం”
*క్యాన్సర్ పేషెంట్ అక్బర్ వలీ కి 6 వ నెలకు మందులు అందచేత.*
గాజేఖాన్ పల్లి, నల్లచెరువు మండలం, అనంతపురం జిల్లాకు చెందిన అక్బర్ వలీ కి ఫిబ్రవరి నెల నుండి *ఫిక్ష్స్ మై నేషన్, మరియు రైతు సంరక్షణ ఫౌండేషన్* తరపున మందులు ఉచితంగా అందించడం జరుగుతోంది.
అక్బర్ వలీ స్వతహాగా రైతు, వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించే వారు. వారికి క్యాన్సర్ మొదటి స్టేజ్ అని తెలిసి వారికి హైదరాబాద్ నిమ్స్ హొస్పిటల్లొ చికిత్స తీసుకొంటున్నారు. CM రీలీఫ్ ఫండ్ కింద లక్ష రూపాయల తో నిమ్స్ హొస్పిటల్లొ చికిత్స చెపించుకొన్న తర్వాత మందులకు నెలకి 7400 డబ్బులు పెట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటే మన ఫౌండేషన్ ని ఆశ్రయించారు. ఆ క్రమంలో గత ఫిబ్రవరి నుండి వారికి మందులు అందచేయడం జరుగుతుంది.
ఈరోజు 30-07-2019 న హైదరాబాద్ లో రైతు సంరక్షణ సభ్యులు భరత్ చౌహాన్, నరేశ్ గొల్లపల్లి, అశోక్ మందులు అందచేయడం జరిగింది. వారికి ఇంకో 3 నెలలు మందులు వాడితే డాక్టర్లు చెప్పిన కోర్స్ అయిపోయి ఆయన పనులు ఆయన చెసుకొని జీవనం సాగిస్థారు.
Leave a Reply